V6 News

రైతులకు గుడ్ న్యూస్: యాసంగి పంట.. ప్రతి గింజనూ కొంటాం..

రైతులకు గుడ్ న్యూస్: యాసంగి పంట.. ప్రతి గింజనూ కొంటాం..

వనపర్తి/రేవల్లి, వెలుగు : యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భరోసా ఇచ్చారు.  వనపర్తి నియోజకవర్గంలోని వనపర్తి టౌన్, గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట, తాడిపర్తి, పొల్కెపహాడ్, రేవల్లి, ఏదుల మండలాల్లో మహిళా సమాఖ్య, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద ఎండ తీవ్రత దృష్ట్యా రైతులకు నీడ, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.  నిబంధనల ప్రకారం తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే సేకరించి, రైతులకు త్వరితగతిన నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం తూర్పు తండాలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడంతో పాటు, రేవల్లి, తల్పునూర్ తదితర గ్రామాలకు చెందిన 20 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే జనగణన-2027లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ మొబైల్ యాప్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు.